హెచ్‌-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..

- August 04, 2026 , by Maagulf
హెచ్‌-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..

అమెరికా: అమెరికాలో హెచ్‌-1బీ మరియు ఎల్‌-1 వీసాలపై సేవలందిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీసాల రెన్యువల్ (పొడిగింపు) దరఖాస్తులపై కూడా వేల డాలర్ల అదనపు ఫీజును వసూలు చేసేలా ఒక కొత్త ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ఒకవేళ ఈ నిబంధన కనుక అమల్లోకి వస్తే, విదేశీ నైపుణ్యంపై ఆధారపడి నడిచే ప్రముఖ టెక్నాలజీ కంపెనీలతో పాటు ఉద్యోగులపై కూడా భారీగా ఆర్థిక భారం పడనుంది.

ఏమిటీ కొత్త వీసా ఫీజు ప్రతిపాదన?
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ రెగ్యులేటరీ ఎజెండా ప్రకారం.. ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు’ నిబంధనల పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. సాధారణంగా ఈ ఫీజు కొత్త హెచ్‌-1బీ లేదా ఎల్‌-1 దరఖాస్తులకు, లేదంటే ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. దీని కింద అర్హత కలిగిన సంస్థలు హెచ్‌-1బీ వీసాకు 4,000 డాలర్లు (సుమారు రూ. 3.81 లక్షలు), ఎల్‌-1 వీసాకు 4,500 డాలర్లు (సుమారు రూ. 4.29 లక్షలు) అదనంగా చెల్లిస్తున్నాయి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై ఉద్యోగి వీసాను పొడిగించే ప్రతిసారీ ఈ భారీ ఫీజును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి, వారిలో సగానికి పైగా ఈ వీసాలపై పనిచేస్తున్న కంపెనీలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

భారతీయ నిపుణులపైనే అత్యధిక ప్రభావం
ఈ కొత్త నిబంధనల వల్ల అత్యధికంగా నష్టపోయేది మన దేశానికి చెందిన నిపుణులే కావడం గమనార్హం. యూఎస్‌సీఐఎస్ (USCIS) 2025 ఆర్థిక సంవత్సరపు డేటా ప్రకారం.. ఆమోదం పొందిన మొత్తం 4.06 లక్షల హెచ్‌-1బీ పిటిషన్లలో ఎక్కువ భాగం కొత్తగా వెళ్లిన వారివి కావు. వాటిలో దాదాపు 2.91 లక్షలు (71 శాతం) కేవలం వీసా పొడిగింపునకు సంబంధించినవే కావడం విశేషం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. ఈ పొడిగింపులు పొందిన వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అక్షరాలా 2.26 లక్షల మంది భారతీయ పౌరులు హెచ్‌-1బీ వీసా పొడిగింపులు పొందారు. ఇది మొత్తం పొడిగింపులలో ఏకంగా 77.6 శాతంగా ఉంది. ఈ జాబితాలో చైనా (31,581) తదితర దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టెక్ దిగ్గజ కంపెనీల పై పెరుగుతున్న ఆర్థిక భారం
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) నివేదిక ప్రకారం.. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు ఈ వీసా పొడిగింపులపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో స్పష్టమవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ (14,532), టీసీఎస్ (5,293), మైక్రోసాఫ్ట్ (4,863), మెటా (4,740), యాపిల్ (4,610), గూగుల్ (4,509) వంటి ప్రముఖ సంస్థలు అత్యధికంగా వీసా పొడిగింపు పిటిషన్ల ఆమోదం పొందాయి. ఈ కొత్త ఫీజుల విధానం కనుక అమల్లోకి వస్తే ఈ కంపెనీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉండగా, ఇది ఎప్పటి నుంచి అమలవుతుందనే దానిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

ఏమిటీ కొత్త వీసా ఫీజు ప్రతిపాదన?
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ రెగ్యులేటరీ ఎజెండా ప్రకారం.. ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు’ నిబంధనల పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. సాధారణంగా ఈ ఫీజు కొత్త హెచ్‌-1బీ లేదా ఎల్‌-1 దరఖాస్తులకు, లేదంటే ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. దీని కింద అర్హత కలిగిన సంస్థలు హెచ్‌-1బీ వీసాకు 4,000 డాలర్లు (సుమారు రూ. 3.81 లక్షలు), ఎల్‌-1 వీసాకు 4,500 డాలర్లు (సుమారు రూ. 4.29 లక్షలు) అదనంగా చెల్లిస్తున్నాయి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై ఉద్యోగి వీసాను పొడిగించే ప్రతిసారీ ఈ భారీ ఫీజును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి, వారిలో సగానికి పైగా ఈ వీసాలపై పనిచేస్తున్న కంపెనీలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

భారతీయ నిపుణులపైనే అత్యధిక ప్రభావం
ఈ కొత్త నిబంధనల వల్ల అత్యధికంగా నష్టపోయేది మన దేశానికి చెందిన నిపుణులే కావడం గమనార్హం.యూఎస్‌సీఐఎస్ (USCIS) 2025 ఆర్థిక సంవత్సరపు డేటా ప్రకారం.. ఆమోదం పొందిన మొత్తం 4.06 లక్షల హెచ్‌-1బీ పిటిషన్లలో ఎక్కువ భాగం కొత్తగా వెళ్లిన వారివి కావు. వాటిలో దాదాపు 2.91 లక్షలు (71 శాతం) కేవలం వీసా పొడిగింపునకు సంబంధించినవే కావడం విశేషం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. ఈ పొడిగింపులు పొందిన వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అక్షరాలా 2.26 లక్షల మంది భారతీయ పౌరులు హెచ్‌-1బీ వీసా పొడిగింపులు పొందారు. ఇది మొత్తం పొడిగింపులలో ఏకంగా 77.6 శాతంగా ఉంది. ఈ జాబితాలో చైనా (31,581) తదితర దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టెక్ దిగ్గజ కంపెనీల పై పెరుగుతున్న ఆర్థిక భారం
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) నివేదిక ప్రకారం.. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు ఈ వీసా పొడిగింపులపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో స్పష్టమవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ (14,532), టీసీఎస్ (5,293), మైక్రోసాఫ్ట్ (4,863), మెటా (4,740), యాపిల్ (4,610), గూగుల్ (4,509) వంటి ప్రముఖ సంస్థలు అత్యధికంగా వీసా పొడిగింపు పిటిషన్ల ఆమోదం పొందాయి. ఈ కొత్త ఫీజుల విధానం కనుక అమల్లోకి వస్తే ఈ కంపెనీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉండగా, ఇది ఎప్పటి నుంచి అమలవుతుందనే దానిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com