ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- August 04, 2026
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలో మంగళవారం నిర్వహించిన ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మచిలీపట్టణం లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో ఎంపీ బాలశౌరి సమావేశమయ్యారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఈ ఎన్డీఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశంలో పలువురు ఎన్డీఏ ఎంపీలు పాల్గొని, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ విధానాల అమలుపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







