కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- August 05, 2026
కువైట్ : కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) హవల్లీ ప్రాంతంలో నకిలీ ప్రభుత్వ స్టాంపులు తయారు చేస్తున్న ముఠాను ఛేదించింది. ఈ కేసులో ఇద్దరు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసింది. దాడుల సందర్భంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న నకిలీ ప్రభుత్వ స్టాంపులతో పాటు వాటి తయారీలో ఉపయోగించిన ప్రింటింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగి పత్రాలపై నకిలీ స్టాంపు ఉపయోగించిన ఆరోపణలతో ఓ క్లీనింగ్ సిబ్బంది సభ్యుడిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం చేపట్టిన దర్యాప్తులో నకిలీ స్టాంపులను అసలు విలువలో సగం ధరకే క్లీనింగ్ సిబ్బందికి విక్రయించి, వాటిని అధికారిక పత్రాలపై వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టైన ఇద్దరు నిందితులు తామే నకిలీ స్టాంపులను తయారు చేసి పలువురు కార్మికులకు విక్రయించినట్లు విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో భాగమైన ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించనుండగా, నకిలీ స్టాంపుల పంపిణీ లేదా వినియోగంలో ప్రమేయం ఉన్న ప్రవాస కార్మికులపై దేశ బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







