'వెక్కిరింత' చిత్ర ఆడియో వేడుక...
- August 15, 2016
కాకర్ల, నాని (శ్రీధర్), వినీత్, ప్రేయసినాయక్, మౌనికరెడ్డి ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం 'వెక్కిరింత'. శ్రీ లాస్య క్రియేషన్స్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించిన చిత్రమిది. చంద్రలేఖ, భానుప్రసాద్.జె. సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయివెంకట్, మహిత్ నారాయణ్, ఖుద్దూస్, బల్లేపల్లి మోహన్, సింహా తదితరులు మాట్లాడుతూ, "ఈ ఏడాది చిన్న చిత్రాలకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి" అని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు నాగబాబు మాట్లాడుతూ, "నిర్మాతలు ముగ్గురూ త్రిమూర్తుల్లాగా వారు అండగా నిలవడంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తిచేయగలిగాను. సినిమా బాగా వచ్చింది. వీనులవిందైన సంగీతం కుదిరింది" అని అన్నారు. కాకర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, "ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ చిత్రానికి పనిచేశారు. ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి" అని అన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు సంగీత దర్శకులు చంద్రలేఖ, భానుప్రసాద్‌లు కృతజ్ఞతలను తెలియజేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









