ధోఫార్‌లో ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అవగాహన ప్రచారం ప్రారంభం..!!
- August 07, 2026
సలాలా: ఒమాన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో ఖరీఫ్ సీజన్ సందర్భంగా ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ పేరుతో ఐదు రోజుల అవయవదాన, శస్త్రచికిత్స ఆరోగ్య అవగాహన ప్రచారం సలాలాలోని అతీన్ మైదానంలో ప్రారంభమైంది. అవయవదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, శస్త్రచికిత్సలపై సరైన అవగాహన కల్పించడం, వ్యాధుల నివారణతో పాటు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అలవాటును ప్రోత్సహించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రచారాన్ని ధోఫార్ గవర్నర్ సయ్యద్ మార్వాన్ బిన్ తుర్కీ అల్ సయీద్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, ఆరోగ్య సంస్థలు, విద్యాసంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలు వైద్యులు, నిపుణులతో నేరుగా సంభాషించే అవకాశం కల్పిస్తున్నారు. అవయవదానంపై నెలకొన్న అపోహలను తొలగించడం, ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడం, సరైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







