సినిమా రివ్యూ: ’కొరియన్ కనకరాజు‘

- August 07, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ’కొరియన్ కనకరాజు‘

వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రమే ’కొరియన్ కనకరాజు‘. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచీ ఆసక్తి క్రియేట్ చేస్తూనే వుంది. సినిమా  పూర్తయ్యాక చేసిన ప్రమోషన్లు సైతం అత్యంత ఆసక్తికరంగా ప్లాన్ చేశారు. ఫైనల్లీ సినిమా రిలీజైంది. ప్రీమియర్ షోకే మంచి టాక్ తెచ్చుకుంది. మరి, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా వుందో, హిట్టు బొమ్మ అందుకుందో లేదో తెలియాలంటే ’కొరియన్ కనకరాజు‘ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
కనకరాజు (అనంతపురం)లోని పెనుగొండలో హాయిగా తిరిగే ఓ కుర్రాడు. తన భజన గ్యాంగ్ తో ఊరిలో కొద్దో గొప్పో సంపాదించుకుంటూ బతికేస్తుంటాడు. తన ఫ్రెండ్ కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలో తన భజన బృందంతో కలిసి ఎంజాయ్ చేస్తూ, అదే ఊళ్లో వున్న చెంగల్ రెడ్డి (సునీల్) గ్యాంగ్‌తో అప్పుడప్పూడూ గొడవలకు దిగుతూ సరదా సరదాగా గడిపేస్తుంటాడు.   వాళ్ల ఊరి పక్కనే వున్న కియా కంపెనీలో ఉద్యోగం చేసే చైత్ర (రితికా నాయక్) అంటే కనకరాజుకు చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసి,. ఎలాగైనా కొరియా వెళ్లి, సెటిల్వా అవ్వాలన్న కలతో వుంటుంది చైత్ర. ఇంతలో, కొరియా నుంచి వచ్చిన పార్సిల్ ఒకటి కనకరాజు జీవితాన్నే మార్చేస్తుంది. ఇంతకీ అసలు ఆ పార్సిల్‌లో ఏముంది.? కనకరాజు శరీరంలోకి ఆత్మ ఎలా ప్రవేశించింది.? ఆ ఆత్మ కనకరాజును ఆవహించాక ఏం జరిగింది.? అసలు ఆ ఆత్మ కనకరాజును ఎందుకు ఆవహించింది.? ఆ తర్వాత కనకరాజు అండ్ గ్యాంగ్ ఏం చేశారు.? అనేది తెలియాలంటే ‘కొరియన్ కనకరాజు’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ సమ్‌థింగ్ డిఫరెంట్. తొలి నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విభిన్నంగా తన కెరీర్‌ను ముందుకు నడిపిస్తూ.. తనదైన డిఫరెంట్ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో తనలోని నటుడ్ని మరో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు వరుణ్ తేజ్. కనకరాజుగా, కొరియన్ మనిషిగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో చాలా చక్కగా ఒదిగిపోయాడు. తనదైన టైమింగ్ కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ రితికా నాయక్‌కి మంచి స్కోపున్న పాత్రే దక్కింది. తన పాత్రలో చాలా అందంగా కనిపించింది. చైత్రగా తన పాత్రకు చక్కటి న్యాయం చేసింది. ఈ సినిమాలో హీరో తర్వాత ఆ స్థాయి.. దాదాపు హీరో స్థాయి పాత్ర సత్యది. సత్య, వరుణ్ తేజ్ కాంబినేషన్ సూపర్‌గా సెట్ అయ్యింది. చాలా కాలం తర్వాత సత్య తన స్థాయి నవ్వులు పూయించాడు ఈ సినిమాతో. అలాగే, మురళీధర్ గౌడ్, సత్య కాంబినేషన్ సీన్లు నెక్స్‌ట్ లెవల్ కామెడీ పంచుతాయ్. సునీల్ గ్యాంగ్‌స్టార్‌గా తన పరిధిలో తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
కామెడీ ప్రధానంగా రూపొందించిన చిత్రమిది. ఆ విషయాన్ని అడుగడుగునా గుర్తు చేసుకునే విధంగా ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా నవ్వించడంలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ కంప్లీట్‌గా సక్సెస్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. కామెడీతో పాటూ, పోరాట ఘట్టాలూ సిట్యువేషనల్‌గా డిజైన్ చేశాడు. లాజిక్కుల్లేకుండా, కామెడీ మ్యాజిక్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని జన్యూన్‌గా తెరపై ఆవిస్కరించాడు. కథ, కథనాలతో సంబంధం లేకుండా కామడీనే ప్రధానాంశంగా ఎంచుకున్న మేర్లపాక గాంధీ ఖాతాలో ‘కొరియన్ కనకరాజు’ ఓ హిట్టు బొమ్మ అవుతుందనడం అతిశయోక్తి కాదు. ఫస్టాఫ్‌లో సినిమా స్టార్ట్ అయ్యాకా ఓ పాట, ఓ ఫైట్ వరకూ సినిమా సో సోగా నడిచింది. ఇక, ఆ తర్వాత నుంచీ నెక్స్‌ట్ లెవల్‌కి చేరుకుంటూ వచ్చింది. ఇక, సెకండాఫ్‌లో కొరియన్ ఆత్మ, కనకరాజు శరీరంలో ప్రవేశించాక సినిమా తీరు అంతకు మించి అన్నట్లుగా ఆడియన్స్‌ని  ఇంటెన్స్ మోడ్‌లోకి తీసుకెళుతుంది. కథలో, కథనంలో అక్కడక్కడా ఏమైనా తప్పులున్నా.. కామెడీతో వాటి జోలికి వెళ్లే అవకాశం లేకుండా ఆడియన్స్‌ని కట్టిపడేశాడు డైరెక్టర్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరో మెయిన్ అస్సెట్. అదిరిపోయే సాంగ్స్‌తో పాటూ, బీజీఎమ్ కుమ్మేశాడు. ఎడిటింగ్ చాలా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ పెనుగొండ ఊరిలోని లొకేషన్స్‌తో పాటూ, కొరియన్ లొకేషన్స్‌నీ హైలైట్ చేయడంలో మంచి పని తనం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ సూపర్బ్. 

ప్లస్ పాయింట్స్:
వరుణ్ తేజ్ మరియు సత్య కామెడీ టైమింగ్, మురళీధర్ గౌడ్, సత్య కాంబినేషన్, పోరాట ఘట్టాలు, కొరియన్ కుర్రాడితో బార్‌లో వరుణ్, సత్య చేసిన హంగామా.. ఇలాంటివి ఇంకా చాలా..

మైనస్ పాయింట్స్:
పెద్దగా మాట్లాడుకోకపోతేనే బెటర్..

చివరిగా:
‘కొరియన్ కనకరాజు’ హండ్రెడ్ పర్సంట్ నవ్వించేస్తాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com