కువైట్‌లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- August 07, 2026
కువైట్ : కువైట్‌లో రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో 48 మందిని అరెస్టు చేశారు. క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్పవర్ సంయుక్తంగా షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వెల్లడించింది.
ఈ తనిఖీల్లో మొత్తం 120 వాణిజ్య సంస్థలను పరిశీలించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఆర్టికల్-20 కింద 9 మంది, ఆర్టికల్-18 కింద 36 మంది, ఆర్టికల్-22 కింద ఒకరు ఉన్నారు. అలాగే ఆర్టికల్-18 కింద నమోదు చేసిన నకిలీ కంపెనీకి సంబంధించిన కేసులో అరెస్ట్ వారెంట్ ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
అరెస్టు చేసిన వారందరిపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు ప్రారంభించి, తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
రెసిడెన్సీ, కార్మిక చట్టాల అమలును మరింత కట్టుదిట్టం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీ కార్యక్రమాలను కొనసాగుతాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







