పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్‌కు జైలు శిక్ష ఖరారు..!!
- August 07, 2026
మనామా: ఇంగ్లిష్ తెలియని పారిశుద్ధ్య కార్మికులను మోసగించి వారి పేర్లతో నకిలీ రాజీనామా లేఖలు సమర్పించిన కేసులో ఓ మేనేజర్‌కు విధించిన జైలు శిక్షను బహ్రెయిన్ సుప్రీంకోర్టు సమర్థించింది. కెన్యాకు చెందిన 41 ఏళ్ల మేనేజర్ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హై క్రిమినల్ కోర్టు అతడికి నకిలీ పత్రాల తయారీ (ఫోర్జరీ) కేసులో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 5,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. అనంతరం అతడు కోర్టులో హాజరై తన వాదనలు వినిపించగా, మే నెలలో శిక్షను మూడేళ్ల జైలు, 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాకు తగ్గించారు. అయితే ఈ తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కోర్టు వివరాల ప్రకారం, కార్మిక మంత్రిత్వ శాఖ భవనాల్లో పారిశుద్ధ్య సేవలు అందించే కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు బహ్రెయిన్ పారిశుద్ధ్య కార్మికుల పేర్లతో వారి అనుమతి లేకుండానే రాజీనామా లేఖలు సిద్ధం చేసి, ఎలక్ట్రానిక్ సంతకాలు ఉపయోగించి ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో సమర్పించాడు. దీంతో వారు ఉద్యోగాలు కోల్పోయారు. అనంతరం వారిలో ఒక్కరికీ కూడా తిరిగి ఉద్యోగం లభించలేదు.
బాధితులు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం, ఇంగ్లిష్‌లో ఉన్న పత్రంపై సంతకం చేయాలని మేనేజర్ కోరగా, అది రాజీనామా పత్రం అని చెప్పలేదు. మొబైల్‌కు వచ్చిన వాట్సాప్ ధృవీకరణ కోడ్‌ను ఇవ్వాలని అడగడంతో వారు ఇచ్చారు. ఆ కోడ్‌ను ఉపయోగించి వారి ఎలక్ట్రానిక్ సంతకాలను రాజీనామా పత్రాలపై నమోదు చేసినట్లు తర్వాత తెలిసిందని వారు తెలిపారు.
ఒక బాధితుడు మాత్రం ఆ కోడ్ ఉద్యోగుల హాజరు (టైమ్‌షీట్) నమోదుకు సంబంధించినదేనని మేనేజర్ చెప్పాడని వెల్లడించాడు. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగితో కలిసి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయడం, నకిలీ పత్రాలను అసలైనవిగా వినియోగించడం వంటి అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







