జిన్సెంగ్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులపై సౌదీ హెచ్చరిక..!!
- August 07, 2026
రియాద్: సౌదీ అరేబియా ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ (SFDA) కొన్ని జిన్సెంగ్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులను వినియోగించవద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఉత్పత్తులపై నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల్లో నిషేధిత రసాయన పదార్థమైన నోర్టడాలాఫిల్ (Nortadalafil) ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది.
హెచ్చరికకు గురైన ఉత్పత్తుల్లో Parsa Coffee (Coffee with Ginseng), Parsa Choco (Dark Chocolate with Ginseng), Bintan SKY (Coffee with Ginseng) ఉన్నాయి. వీటి అన్ని బ్యాచ్‌లను వినియోగించకుండా వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన ప్యాకెట్లను సురక్షితంగా పారవేయాలని SFDA ప్రజలకు సూచించింది.
ఈ ఉత్పత్తుల్లో గుర్తించిన నిషేధిత పదార్థం ఆరోగ్యానికి హానికరమని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రభావిత ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకునే చర్యలు ప్రారంభించినట్లు SFDA తెలిపింది. అలాగే వాటిని దిగుమతి చేసిన సంస్థలపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా 10మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్‌లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్‌కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్‌లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!
- జిన్సెంగ్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈ ఆగస్టు లాంగ్ వీకెండ్‌కు సలాలా ఫస్ట్ ఛాయిస్..!!
- ట్రైనీ ఐపీఎస్‌కు సీపీ సజ్జనార్ షాక్: 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ!







