ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!
- August 07, 2026
మస్కట్: ఉద్యోగుల సేవా విరమణ (ఎండ్ ఆఫ్ సర్వీస్) ప్రయోజనాల చెల్లింపులో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఒమాన్ కార్మిక శాఖ ప్రైవేట్ సంస్థలు, యజమానులను ఆదేశించింది. సామాజిక రక్షణ చట్టం (Social Protection Law) పరిధిలోకి రాని ఉద్యోగులకు ఒప్పందం ముగిసిన వెంటనే చట్టప్రకారం చెల్లించాల్సిన అన్ని బకాయిలు, సేవా విరమణ ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని స్పష్టం చేసింది.
కార్మిక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, పాత కార్మిక చట్టం కింద కుదిరిన ఉద్యోగ ఒప్పందాలకు తొలి మూడు సంవత్సరాల వరకు ప్రతి పూర్తి సేవా సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక వేతనం చొప్పున, నాలుగో సంవత్సరం నుంచి ప్రతి పూర్తి సేవా సంవత్సరానికి 30 రోజుల ప్రాథమిక వేతనం చొప్పున సేవా విరమణ ప్రయోజనాలు చెల్లించాలి.
అదేవిధంగా, రాయల్ డిక్రీ నెం. 53/2023 ద్వారా అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టం కింద నియమితులైన ఉద్యోగులకు ప్రతి పూర్తి సేవా సంవత్సరానికి కనీసం ఒక నెల ప్రాథమిక వేతనానికి సమానమైన సేవా విరమణ ప్రయోజనం అందించాలని పేర్కొంది.
అన్ని సేవా విరమణ ప్రయోజనాలను ఉద్యోగి ఉద్యోగం ముగిసే సమయానికి పొందుతున్న చివరి ప్రాథమిక నెలవారీ వేతనం ఆధారంగా లెక్కించాల్సి ఉంటుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్‌లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్‌కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్‌లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!
- జిన్సెంగ్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈ ఆగస్టు లాంగ్ వీకెండ్‌కు సలాలా ఫస్ట్ ఛాయిస్..!!







