కువైట్‌లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!

- August 07, 2026 , by Maagulf
కువైట్‌లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!

కువైట్ : కువైట్‌లో రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో 48 మందిని అరెస్టు చేశారు. క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్‌పవర్ సంయుక్తంగా షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వెల్లడించింది.

ఈ తనిఖీల్లో మొత్తం 120 వాణిజ్య సంస్థలను పరిశీలించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఆర్టికల్-20 కింద 9 మంది, ఆర్టికల్-18 కింద 36 మంది, ఆర్టికల్-22 కింద ఒకరు ఉన్నారు. అలాగే ఆర్టికల్-18 కింద నమోదు చేసిన నకిలీ కంపెనీకి సంబంధించిన కేసులో అరెస్ట్ వారెంట్ ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

అరెస్టు చేసిన వారందరిపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు ప్రారంభించి, తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

రెసిడెన్సీ, కార్మిక చట్టాల అమలును మరింత కట్టుదిట్టం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీ కార్యక్రమాలను కొనసాగుతాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com