ఖతార్‌లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్‌మెంట్‌కు స్వాగతం..!!
- August 08, 2026
దోహా: వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి సరదాగా గడిపేందుకు ఖతార్‌లో అనేక వినోద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. హలా సమ్మర్ 2026 కార్యక్రమంలో భాగంగా ఖతార్ టూరిజం సంస్థ వివిధ అమ్యూజ్మెంట్ పార్కులు, ఇండోర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే జోన్లను సందర్శకులకు పరిచయం చేస్తోంది. ఖతార్‌లోని ప్రముఖ వినోద కేంద్రాల్లో రైడ్లు, గేమ్స్, మంచుతో కూడిన సాహసాలు, ఇంటరాక్టివ్ ప్లే ఏరియాలు వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి. పిల్లలు, యువత, పెద్దలు తమకు నచ్చిన వినోదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.
స్నో డ్యూన్స్: దోహా ఫెస్టివల్ సిటీలో ఉన్న స్నో డ్యూన్స్‌లో మంచుతో కూడిన వివిధ కార్యకలాపాలు, ఇంటరాక్టివ్ అనుభవాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు వినోదంతో పాటు షాపింగ్, భోజనాన్ని కూడా ఒకే ప్రదేశంలో ఆస్వాదించవచ్చు.
దోహా క్వెస్ట్: మిషెరెబ్లో ఉన్న దోహా క్వెస్ట్ కతార్‌లో తొలి పూర్తిస్థాయి ఇండోర్ థీమ్ పార్క్‌గా గుర్తింపు పొందింది. వివిధ రైడ్లు, థీమ్ ఆకర్షణలు, ఇమర్సివ్ అనుభవాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సమీపంలోని మిషెరెబ్ మ్యూజియమ్స్, సౌక్ వాఖిఫ్, దోహా కార్నిష్ను కూడా సందర్శించవచ్చు.
యాంగ్రీ బర్డ్స్ వరల్డ్: దోహా ఫెస్టివల్ సిటీలోని యాంగ్రీ బర్డ్స్ వరల్డ్‌లో ప్రసిద్ధ యాంగ్రీ బర్డ్స్ థీమ్‌తో రైడ్లు, గేమ్స్, కుటుంబ వినోద కార్యక్రమాలు ఉన్నాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇక్కడ సరదాగా గడపవచ్చు.
మెగాపోలిస్: ది పెర్ల్-ఖతార్‌లోని మదీనా సెంట్రల్లో ఉన్న మెగాపోలిస్‌లో ఆర్కేడ్ గేమ్స్, గోల్ఫ్, కార్ రేసింగ్ సిమ్యులేటర్లు, బౌలింగ్, బిలియర్డ్స్, కరోకే వంటి సదుపాయాలు ఉన్నాయి. వినోదంతో పాటు వాటర్‌ఫ్రంట్ ప్రాంతాల్లో సందడి చేయవచ్చు.
కిడ్జ్మోండో: మాల్ ఆఫ్ ఖతార్‌లో ఉన్న కిడ్జ్మోండో పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇండోర్ ఇంటరాక్టివ్ సిటీ. వివిధ వృత్తులను రోల్‌ప్లే ద్వారా తెలుసుకునే అవకాశం పిల్లలకు ఇక్కడ లభిస్తుంది. ఆటతో పాటు విద్యను అందించేలా దీన్ని రూపొందించారు.
బౌన్స్: తవార్ మాల్లోని బౌన్స్‌లో ట్రాంపొలిన్ జంప్స్, వాల్ రన్నింగ్, డాడ్జ్‌బాల్, అబ్స్టకిల్ ఛాలెంజ్ వంటి యాక్టివిటీలను ఆస్వాదించవచ్చు. అన్ని వయసుల వారికి అనువైన వినోద కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి.
వేసవి సెలవులకు ప్రత్యేక ఆకర్షణలు
ఈ వినోద కేంద్రాలతో పాటు హలా సమ్మర్ 2026, కిడ్స్ గో ఫ్రీ కార్యక్రమాలు కుటుంబాలకు మరిన్ని వినోద అవకాశాలను అందిస్తున్నాయి. షాపింగ్, భోజనం, పర్యాటక ప్రదేశాల సందర్శనతో పాటు వినోదాన్ని కూడా ఒకే పర్యటనలో ఆస్వాదించేలా ఖతార్‌లోని ఈ ఆకర్షణలు అందుబాటులో ఉన్నాయి.
ఖతార్‌లో వేసవి సెలవులను కుటుంబంతో కలిసి గడపాలనుకునే వారికి ఈ వినోద కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్‌లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్‌మెంట్‌కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్







