నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- August 08, 2026
మనామా: నిర్మాణ పనులు, రోడ్డు తవ్వకాలు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ తదితర ప్రజా అవసరాల పనుల నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఊరట కల్పించే దిశగా బహ్రెయిన్‌లో కొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది.
నివాస ప్రాంతాలకు సమీపంలో చేపట్టే ప్రజా పనుల సమయంలో శబ్ద నియంత్రణకు స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని పలువురు ఎంపీలు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా పని దినాల్లో ఉదయం 7 గంటలలోపు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉదయం 8 గంటలలోపు శబ్దంతో కూడిన పనులు ప్రారంభించకుండా నిషేధం విధించాలని సూచించారు. అలాగే అన్ని పనులను రాత్రి 8 గంటలలోపు పూర్తిచేయాలని ప్రతిపాదించారు.
అయితే నీటి సరఫరా లేదా విద్యుత్ అంతరాయాల కారణంగా అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతు పనులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. అలాగే వేసవిలో అత్యంత వేడి సమయాల్లో బహిరంగ పనులపై ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఎంపీలు బదర్ అల్ తమీమీ, అబ్దుల్లా అల్ ధాయెన్, అలీ అల్ నుఐమీ, అలీ సాకర్ అల్ దోసెరి, హిషామ్ అల్ అవాధి ఈ ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నిర్మాణ పనులకు సంబంధించి స్పష్టమైన పని సమయాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు డ్రిల్లింగ్, తవ్వకాలు, ఇతర శబ్దంతో కూడిన పనులను అనుకూలం కాని సమయాల్లో చేపడుతున్నారని ఎంపీలు తెలిపారు. దీంతో సమీప నివాసితుల రోజువారీ జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోందన్నారు.
ముఖ్యంగా రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు నిర్మాణ పనుల శబ్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాత్రివేళల్లో నిద్రకు భంగం కలగడం, ఉదయం వేళల్లో భారీ శబ్దాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్‌లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్‌మెంట్‌కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్







