జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పోలీసింగ్‌ పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

- August 10, 2026 , by Maagulf
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పోలీసింగ్‌ పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

తెలంగాణ: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ జయశంకర్ భూపాలపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయా జిల్లాల ఎస్పీలు తమ పరిధిలోని నేర గణాంకాలు, చేపట్టిన కొత్త కార్యక్రమాలు, ప్రాంతీయంగా ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలు, నేరస్థులు ఉపయోగించే ట్రాన్సిట్ మార్గాలు, మోసాలు, ఆర్థిక నేరాల కేసులు తదితర అంశాలపై డీజీపీకి వివరించారు.

కీలక సంస్థల వద్ద భద్రతను బలోపేతం చేయాలి

ప్రాంతంలోని కీలక సంస్థలు, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థల వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా GENCO, సింగరేణి వంటి కీలక సంస్థల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అదే సమయంలో నేరాల నియంత్రణలో ముందస్తు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాంతంలోని నేరాలకు సంబంధించిన ట్రాన్సిట్ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

మాదకద్రవ్యాల పై ప్రత్యేక దృష్టి

సమీక్షలో EAGLE, CSB, TG-SPARK, CID విభాగాలకు చెందిన ఎస్పీలు తమ పరిశీలనలు, గణాంకాలు, నిర్దిష్ట సిఫారసులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను డీజీపీతో పంచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు యూనిట్లలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు కొత్త తరహా నేరాలు, సైబర్ ఆధారిత నేరాలు సహా పెరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ సూచించారు.

మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటాన్ని ప్రతి పోలీసు అధికారి వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నిఘాను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com