టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం

- August 10, 2026 , by Maagulf
టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం

న్యూ ఢిల్లీ: టికెట్ లేని ప్రయాణికుల దౌర్జన్యాలు, లంచాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే టీటీఈలకు బాడీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులతో జరిగే వాగ్వాదాలు, దాడులను రికార్డ్ చేసేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. 1080హెచ్‌డీ క్వాలిటీతో, 12 గంటల బ్యాటరీ లైఫ్‌తో, 32 జీబీ స్టోరేజ్‌తో ఈ కెమెరాలు పనిచేస్తాయి. రికార్డయిన డేటాను టీటీఈలు మార్చడం సాధ్యం కాదు. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైళ్ల సిబ్బందికి వీటిని అందించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com