ఫ్రాడ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, బహ్రెయిన్ నుంచి బహిష్కరణ..!!
- August 10, 2026
మనామా: క్లీనింగ్ ఉత్పత్తులపై గడువు తేదీలను తొలగించి విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులకు బహ్రెయిన్‌లోని లోయర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన వెంటనే ఇద్దరినీ దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
బుడాయా పోలీస్ స్టేషన్‌కు ఓ ప్రముఖ రిటైల్ స్టోర్ నుంచి ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, సరఫరాదారు సంస్థకు చెందిన మరో ఉద్యోగి కలిసి క్లీనింగ్ ఉత్పత్తుల ప్యాకేజీలపై ఉన్న గడువు తేదీలను తొలగించినట్లు స్టోర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు లభించాయి. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో గడువు తేదీలు తొలగించిన పలు ప్యాకేజీలతో పాటు ఇప్పటికే గడువు ముగిసిన ఇతర ఉత్పత్తులు కూడా గుర్తించారు. గడువు తేదీలను తొలగించేందుకు ఉపయోగించిన పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో ఇద్దరు నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. గడువు ముగిసిన ఉత్పత్తులను తనిఖీ చేసే బాధ్యత తనపై ఉండటంతో.. వాటి కారణంగా జీతం నుంచి కోత పడుతుందనే భయంతో గడువు తేదీలను తొలగించినట్లు స్టోర్ ఉద్యోగి విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







