మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- August 10, 2026
కౌలాలంపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని మలేషియాలో చాటిచెప్పే లక్ష్యంతో మలేషియా తెలంగాణ సంఘం (MYTA) ఆధ్వర్యంలో నిర్వహించిన “బోనాలు 2026” వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘన విజయాన్ని సాధించాయి. మలేషియాలోని నెగెరి సెంబిలాన్, పోర్ట్ డిక్సన్ సమీపంలోని శ్రీ మహా కరుమారియమ్మన్ ఆలయంలో ఆదివారం, ఆగస్టు 9న నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణకు చెందిన కుటుంబాలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను సమర్పిస్తూ, మంగళహారతులు, భక్తి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మహాంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న బోనాల పండుగను మలేషియాలోనూ అదే భక్తి, సంప్రదాయబద్ధతతో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో భాగంగా భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మినరల్ వాటర్‌తో పాటు బస్సు రవాణా సౌకర్యం కల్పించడంతో కార్యక్రమానికి హాజరైన కుటుంబాలకు MYTA ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, మలేషియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ బోనాల వేడుకలు విజయవంతమయ్యాయని MYTA ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు,మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు,జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, దీపిక, మోనా, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి,అడ్వైసరీ మెంబర్స్ గురిజాల సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి మరియు ఇతరులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆలయ నిర్వాహకులు,వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు, మహిళలు,యువత, చిన్నారులు మరియు మలేషియాలోని తెలంగాణ కుటుంబాలందరికీ MYTA హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. “తెలంగాణ సంస్కృతి–మన గర్వం, మన సంప్రదాయం – మన బాధ్యత” అనే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని MYTA పేర్కొంది.

తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్‌గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్‌ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







