'హై' నుంచి ఫస్ట్ సింగిల్ ఫనా రిలీజ్
- August 10, 2026
హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైనన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ‘హై’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫనా’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. వికాస్ బడిస సంగీతం అందించిన ఈ పాట ప్రేమలోని స్వచ్ఛమైన భావోద్వేగాన్ని సూఫీ మ్యూజిక్ టచ్ తో ఆకట్టుకుంటోంది. షహజాద్ అలీ ఆలపించిన ఈ పాటకు ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అద్భుతంగా వుంది.
‘ఫనా’పాటలోని మెలోడీ, సూఫీ ఫీల్, ప్రేమను ప్రతిబింబించే సాహిత్యం కలిసి వినసొంపైన అనుభూతిని అందిస్తున్నాయి.
‘హై’లోని ప్రేమకథకు ఈ పాట ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ లేయర్‌ను జోడిస్తోంది.
టీజర్‌తో ఆసక్తిని పెంచిన ‘హై’.. ఇప్పుడు ‘ఫనా’ పాటతో మ్యూజిక్ పరంగానూ అంచనాలను పెంచుతోంది.
ఈ చిత్రానికి మల్లు నాయక్, సునీల్ రెడ్డి డీవోపీగా GRK శరణ్ రావుల ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు)
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఎస్ కృష్ణ
నిర్మాతలు: హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల
బ్యానర్లు: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్
సంగీతం: వికాస బాదిసా
ఎడిటర్: GRK శరణ్ రావుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, సురేష్ బనిశెట్టి
సినిమాటోగ్రాఫర్లు: మల్లు నాయక్, సునీల్ రెడ్డి (సెకండ్ యూనిట్ DOP)
కొరియోగ్రాఫర్: శిరీష్ కుమార్
యాక్షన్: వి వెంకట్
సౌండ్ డిజైన్: ప్రదీప్ జి
కలరిస్ట్: ఆండ్రియాస్ బ్రూకెల్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మనాథ్ ఎ. పాటిల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరీష్
లైన్ ప్రొడ్యూసర్: వి జానకి రామ్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







