'స్లమ్ డాగ్' నుంచి పవర్‌ఫుల్ ఆఫీసర్ గౌరీ హెగ్డేగా టబు గ్లింప్స్ రిలీజ్
- August 10, 2026
డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మొదటిసారిగా కలసి చేస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. రా ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే టబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఆమె పాత్రకు సంబధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
నగరంలోని స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లింప్స్.. అక్కడి రఫ్ అండ్ గ్రిటీ వాతావరణాన్ని పరిచయం చేస్తూ మొదలవుతుంది. ఆ తర్వాత కారు దిగుతూ, సిగరెట్ వెలిగించి, పరిస్థితులను తన కంట్రోల్‌లోకి తీసుకునే గౌరి హెగ్డేగా టబు ఎంట్రీ ఇచ్చారు. స్థానిక గూండాకు వార్నింగ్ ఇచ్చి, ఆ వెంటనే చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో చెబుతోంది.
గౌరి హెగ్డే కేవలం పవర్‌ఫుల్ ఆఫీసర్ మాత్రమే కాదు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని, భయమంటే తెలియని, కాంప్రమైజ్ కాని మహిళగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. రోడ్డుపై గూండాలను ఎదుర్కొంటూ, లాఠీతో వారిని అదుపులోకి తీసుకునే విధానం పాత్రలోని అగ్రెషన్‌ను చూపిస్తుంది. చుట్టూ పోలీసులు, జనం ఉన్నా ఆమె మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పవర్ ని చూపిస్తోంది.
‘One Fearless Woman’, ‘Powerful Officer’, ‘Ruthless’, ‘Merciless’, ‘Devil In The Department’ అంటూ గ్లింప్స్‌లో కనిపించే పదాలు గౌరి హెగ్డే పాత్ర స్వభావాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చివర్లో “గౌరి హెగ్డే, డిప్యూటీ కమిషనర్, ఇన్‌కమ్ ట్యాక్స్” అంటూ టబు తనను తాను పరిచయం చేసుకునే సీన్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇంట్రడక్షన్‌లో పూరి జగన్నాథ్ మార్క్ కనిపిస్తోంది. గ్లింప్స్‌లో విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించిన కొన్ని షాట్లు కూడా ఆకట్టుకున్నాయి.
గౌరి హెగ్డేగా టబు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాత్రకు ప్రత్యేకమైన పవర్ తీసుకొచ్చారు. ఆమె లుక్స్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ పాత్రపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. పవర్‌ఫుల్ క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో తనదైన శైలిని చూపించే పూరి జగన్నాథ్.. గౌరి హెగ్డే పాత్రను కూడా అదే తరహాలో ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్.
పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, దునియా విజయ్ కుమార్, బ్రహ్మాజీ, విటివి గణేష్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి నారాయణ్ రావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరీ కనెక్ట్స్
CEO: విష్ణు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: సామ్ కె నాయుడు
ఎడిటింగ్: సంతోష్ నూజిళ్ల
VFX: అనిల్ పదురి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







