రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!
- August 11, 2026
దోహా: రాత్రివేళ వాహనాలకు లైట్లు వేయకుండా డ్రైవింగ్ చేసే వాహనదారులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. రాత్రి సమయంలో వాహనాల హెడ్లైట్లు సక్రమంగా వినియోగించాలని వాహనదారులకు సూచించింది.
లైట్లు లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరగడంతో పాటు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని MoI పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
ట్రాఫిక్ చట్టానికి సంబంధించిన 2007 నాటి చట్టం నంబర్ 19లోని ఆర్టికల్ 70 ప్రకారం, రాత్రి సమయంలో సరైన లైట్లు లేకుండా వాహనాలను నడపకూడదు. వాతావరణ పరిస్థితుల కారణంగా విజిబిలిలీ తక్కువగా ఉన్న పగటిపూట కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. మోటారు వాహనాల విషయంలో, హెడ్లైట్లు మరియు వెనుక లైట్లను (rear lights) తప్పనిసరిగా ఉపయోగించాలని చట్టం నిర్దేశిస్తోంది. వాహనదారులు ఈ ఉల్లంఘనకు పాల్పడితే ఒక వారం కంటే తక్కువ కాకుండా మరియు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాకుండా జైలు శిక్ష, లేదా QR 3,000 నుండి QR 10,000 వరకు జరిమానా విధించవచ్చు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







