సమైల్‌లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- August 13, 2026
మస్కట్: ఒమన్‌లోని సమైల్‌లో అల్ మహా పెట్రోలియం ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఇంధన స్టేషన్లో ఓ వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు ఇంధన పంప్ వరకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అల్ మహా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇంధన స్టేషన్ ప్రాంగణంలో క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయని సంస్థ పేర్కొంది. ఘటన కారణంగా జరిగిన నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు తెలిపింది. స్టేషన్లో కార్యకలాపాలను సురక్షితంగా పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
వచ్చే కొద్ది రోజుల్లో స్టేషన్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అల్ మహా తెలిపింది. వినియోగదారులు, ఉద్యోగులు, సమాజ భద్రతే తమ సంస్థకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







