సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- August 14, 2026
సలాలా: ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ధోఫార్ గవర్నరేట్‌లోని సలాలా అల్ దహారిజ్ బీచ్‌లో మూడు రోజుల క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించారు. ఖరీఫ్ ధోఫార్ (వర్షాకాలం) సీజన్‌ను పురస్కరించుకుని ఒమన్ సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒమన్ సంప్రదాయ క్రీడలు, ఆటలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు.. ధోఫార్ గవర్నరేట్‌కు వచ్చే పర్యాటకులకు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో సలాలాకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా పలు క్రీడా, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధోఫార్ గవర్నరేట్ క్లబ్స్ ఛాంపియన్షిప్ ఫర్ ఒమానీ ట్రెడిషనల్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే పిల్లలకు ఒమన్ సంప్రదాయ ఆటలను స్వయంగా ఆడే అవకాశం కల్పించేందుకు వర్చువల్ రియాలిటీ (VR) సాంకేతికతతో ప్రత్యేక ఇంటరాక్టివ్ వేదికను ఏర్పాటు చేశారు. సంప్రదాయ ఆటలు, క్రీడలకు సంబంధించిన ఫొటోలు, పెయింటింగ్స్, వివిధ ప్రదర్శనలతో కూడిన చిన్న ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శకుల కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







