తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- August 14, 2026
మనామా: తూర్పు రిఫాలోని బ్లాక్ 919లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని సదరన్ మునిసిపాలిటీ అధికారులు కూల్చివేశారు. మునిసిపల్ నిబంధనల ఉల్లంఘనలను తొలగించి, నిబంధనలను కఠినంగా అమలు చేసే చర్యల్లో భాగంగా ఈ కూల్చివేత చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
2001 నాటి మునిసిపాలిటీస్ చట్టం నంబర్ 35, 1977 నాటి భవనాల నియంత్రణ చట్టం నంబర్ 13, 1996 నాటి పబ్లిక్ రోడ్స్ ఆక్యుపేషన్ చట్టం నంబర్ 2 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు మునిసిపాలిటీ తెలిపింది. అక్రమ ఆక్రమణలను తొలగించడం, నిబంధనల అమలును మెరుగుపరచడం, నివాస ప్రాంతాల డిజైన్లు, ప్రజల భద్రతను పరిరక్షించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఉత్తర గవర్నరేట్‌లోనూ చర్యలు
ఇదే తరహాలో తనిఖీలు ఉత్తర గవర్నరేట్‌లోనూ కొనసాగుతున్నాయి. అల్ రమ్లీలో షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్, షేక్ జాయెద్ స్ట్రీట్ వెంట గుర్తించిన 61 అక్రమ నిర్మాణాల్లో ఇప్పటికే 47 నిర్మాణాలను అధికారులు తొలగించారు. తదుపరి దశలో మరిన్ని ప్రాంతాల్లో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీస్ అఫైర్స్ అండ్ అగ్రికల్చర్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. భవన నిర్మాణ ఉల్లంఘనల్లో 68 శాతం అనుమతి లేకుండా నిర్మించినవే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!







