ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- August 14, 2026
సలాలా: ఒమన్‌లోని ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. జూన్ 21 నుంచి జూలై 31 వరకు మొత్తం 4,72,449 మంది పర్యాటకులు ధోఫర్‌ను సందర్శించారు. గతేడాది ఇదే కాలంలో నమోదైన 4,42,100 మందితో పోలిస్తే ఈసారి సందర్శకుల సంఖ్య 6.9 శాతం పెరిగింది.
ఒమన్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల ప్రకారం.. మొత్తం సందర్శకుల్లో ఒమన్ పౌరులే అత్యధికంగా ఉన్నారు. వారి సంఖ్య 3,60,531 కాగా, మొత్తం సందర్శకుల్లో వారి వాటా 76.3 శాతంగా ఉంది. గతేడాది ఇదే కాలంలో 3,34,399 మంది ఒమన్ పౌరులు ధోఫర్‌ను సందర్శించారు. ఆ తర్వాతి స్థానంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 78,356 మంది GCC సందర్శకులు రాగా, వారి వాటా 16.6 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 69,801 మంది GCC పర్యాటకులు వచ్చారు. ఇతర దేశాలకు చెందిన పర్యాటకుల సంఖ్య 33,562గా నమోదైంది. మొత్తం సందర్శకుల్లో వీరి వాటా 7.1 శాతం కాగా, గతేడాది ఇదే కాలంలో 37,900 మంది నమోదయ్యారు.
విమానాల ద్వారా ధోఫర్‌కు వచ్చిన పర్యాటకుల సంఖ్య ఈసారి 9.6 శాతం పెరిగింది. జూన్ 21 నుంచి జూలై 31 వరకు విమాన మార్గంలో 1,17,551 మంది చేరుకున్నారు. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1,07,254గా ఉంది. భూ సరిహద్దుల ద్వారా వచ్చిన సందర్శకుల సంఖ్య కూడా 5.9 శాతం పెరిగి 3,54,898**కు చేరింది. గతేడాది ఇదే కాలంలో 3,34,846 మంది భూ మార్గంలో ధోఫర్‌కు వచ్చారు.
జూలైలోనే 95.5 శాతం మంది
సందర్శకుల రాకలో జూలై నెల కీలకంగా నిలిచింది. మొత్తం పర్యాటకుల్లో 95.5 శాతం మంది జూలై 1 నుంచి 31 మధ్య ధోఫర్‌ను సందర్శించారు. ఈ కాలంలో 4,51,355 మంది రాగా, గతేడాది ఇదే సమయంలో 4,21,506 మంది నమోదయ్యారు. ఇక జూన్ 21 నుంచి 30 వరకు ఈ ఏడాది 21,094 మంది ధోఫర్‌ను సందర్శించారు. గతేడాది ఇదే కాలంలో 20,594 మంది పర్యాటకులు వచ్చినట్లు NCSI గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







