సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- August 14, 2026
అబ్హా: సౌదీ అరేబియాలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అడవి జంతువు ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తిని అసీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసీర్ ఎన్విరాన్‌మెంటల్ సెక్యూరిటీ స్పెషల్ ఫోర్సెస్ సహకారంతో నిందితుడు హుస్సేన్ దాఫెర్ హుస్సేన్ అల్-ఖహ్తానీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, వివిధ రకాల 20 రౌండ్ల మందుగుండు సామగ్రి, నాలుగు అడవి జంతువులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.
అడవి జంతువులను వేటాడటాన్ని సౌదీ పర్యావరణ చట్టం, దాని అమలు నిబంధనలు నిషేధిస్తున్నాయని పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఐబెక్స్‌ను వేటాడితే 60 వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వేటాడితే 10 వేల రియాల్స్, నిషేధిత ప్రాంతాల్లో వేటాడితే 5 వేల రియాల్స్ జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
పర్యావరణం, వన్యప్రాణులకు సంబంధించిన ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పబ్లిక్ సెక్యూరిటీ విజ్ఞప్తి చేసింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







