భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- August 14, 2026
న్యూఢిల్లీ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘భారత్ కో జానియే’ (Know India) క్విజ్ లో పాల్గొనేందుకు గడువు నేటితో ముగియనుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ యువత, ఎన్నారైలు (NRIలు), భారత సంతతి వ్యక్తులు (PIOలు), అలాగే విదేశీ పౌరుల కోసం ఈ క్విజ్‌ను నిర్వహిస్తున్నారు. భారతదేశ చరిత్ర, వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, దేశ ప్రగతి, విజయాలకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి.
భారత్ గొప్ప వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకునేలా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. విదేశాల్లో ఉన్న భారతీయ యువతతో పాటు భారతదేశంపై ఆసక్తి ఉన్న విదేశీయులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
క్విజ్ వెబ్‌సైట్: భారత్ కో జానియే క్విజ్ (https://bkjquiz.com )
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







