తెలంగాణ లో కొత్తగా TG SAFE
- August 16, 2026
హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం మరొక విప్లవాత్మక అడుగు వేసింది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంతో పాటు మార్కెట్లో నకిలీ ఔషధాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లను ఏకీకృతం చేస్తూ ‘TG SAFE’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్)ను అమల్లోకి తెచ్చింది. ఈ రెండు విభాగాల విలీనం ద్వారా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, నాణ్యతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార భద్రత మరియు ప్రజా ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
విలీన ప్రక్రియ వివరాలు: ప్రాథమికంగా ‘క్యూర్ రీజియన్’లో అమలు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 చట్టబద్ధ నిబంధనలకు ఎలాంటి ఆటంకం కలగకుండానే ఈ రెండు శాఖల విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నూతన వ్యవస్థను తొలుత ‘క్యూర్ రీజియన్’ (CURE Region) పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. ఆహార పసిగట్టుడు, ఔషధ తనిఖీల ప్రక్రియ ఒకే గొడుగు కిందకు రావడం వల్ల అధికారుల మధ్య సమన్వయం పెరిగి, అక్రమార్కులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం







