ఫ్యాషన్ సంస్థకు BD2,300 చెల్లించాలని కోర్టు ఆదేశం..!!
- August 18, 2026
మనామా: బకాయి వేతనాలు, వార్షిక సెలవుల పరిహారం తదితర ఉద్యోగ ప్రయోజనాల కింద ఓ విదేశీ ఫ్యాషన్ డిజైనర్‌కు BD2,300 చెల్లించాలని బహ్రెయిన్ హై లేబర్ కోర్టు ఓ ఫ్యాషన్ సంస్థను ఆదేశించింది.
విదేశీ ఫ్యాషన్ డిజైనర్ 2024 నవంబర్ 7 నుంచి 2025 నవంబర్ 7 వరకు సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేశారు. ఆమెకు నెలకు BD500 వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే కొన్ని నెలల జీతాలు, కాంట్రాక్ట్ చివరి ఏడు రోజుల వేతనం, BD200 జీతం కోతతో పాటు వినియోగించని వార్షిక సెలవులకు సంబంధించిన మొత్తాన్ని సంస్థ చెల్లించలేదని ఆమె కోర్టును ఆశ్రయించారు.
అయితే సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది. డిజైనర్‌కు BD1,000 నగదుగా ఇచ్చామని, అందులో BD100 తిరిగి చెల్లించలేదని పేర్కొంది. అలాగే బహ్రెయిన్ వెలుపల విక్రయించేందుకు BD2,860 విలువైన పెర్ఫ్యూమ్స్ ను ఆమెకు అప్పగించామని, వాటి విక్రయ సొమ్మును సంస్థకు అందజేయలేదని వాదించింది. ఈ మొత్తాలను కలిపి BD2,960 తనకు చెల్లించాలని సంస్థ డిమాండ్ చేసింది.
కేసును విచారించిన కోర్టు.. సంస్థ తన వాదనలకు మద్దతుగా ఎలాంటి పత్రాలు, రసీదులు లేదా ఇతర ఆధారాలను సమర్పించలేకపోయిందని గుర్తించింది. పెర్ఫ్యూమ్స్ సరఫరాపై సాక్ష్యం ఇచ్చిన వ్యక్తికి కూడా ఇరుపక్షాల మధ్య ఉన్న ఒప్పంద నిబంధనలు, వస్తువులకు లేదా వాటి విక్రయ సొమ్ముకు ఏమైందన్న విషయం తెలియదని కోర్టు పేర్కొంది. దీంతో సంస్థ చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. డిజైనర్‌కు బకాయి వేతనాలతో పాటు ఆలస్యానికి పరిహారం, వార్షిక సెలవుల బకాయికి BD500, ఏడాదికి 1 శాతం చట్టపరమైన వడ్డీతో పాటు కోర్టు ఖర్చులు, న్యాయవాది ఫీజులు చెల్లించాలని ఫ్యాషన్ సంస్థను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- కువైట్‌లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!
- లైసెన్స్ లేకుండా నగదు బదిలీలు.. ఆసియా ప్రవాసుడు అరెస్ట్..!!
- ఫ్యాషన్ సంస్థకు BD2,300 చెల్లించాలని కోర్టు ఆదేశం..!!
- లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. సౌదీలో కొత్త నిబంధనలు..!!
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు రోజుకు Dh80కే రెంట్ కార్స్..!!
- దుబాయ్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం GDRFA ప్రత్యేక ఏర్పాట్లు
- మరణశిక్ష కోసం విషపూరిత ఇంజెక్షన్ పద్ధతిని నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే
- అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు







