చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- August 18, 2026
న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలోచిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM)లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అనుమతిస్తే ఐటీ చట్టంలోనిసెక్షన్ 79 ప్రకారం లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY)స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌లపై అభ్యంతరకర కంటెంట్‌ను అరికట్టడంలో విఫలమైతే చట్టపరమైన మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పింది. భారతదేశంలోని విభిన్న భాషలు, సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా డీప్‌ఫేక్ ద్వారా సృష్టించిన కంటెంట్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించేలా తప్పనిసరిగా లేబుల్ చేయాలని అధికారులు సూచించారు.
దేశీయ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే
వాక్ స్వాతంత్య్రం ముఖ్యమైనదే అయినప్పటికీ, దేశంలో పనిచేసే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి తీరాల్సిందేనని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ‘X’ (గతంలో ట్విట్టర్) అకౌంట్ల నిలిపివేతపై తెచ్చిన పారదర్శకత నిబంధనల నేపథ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







