టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- August 18, 2026
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘ఓపెన్ఏఐ’ (OpenAI) టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త (ChatGPT for Teens ) వెర్షన్‌ను లాంచ్ చేసింది. 13 నుండి 17 సంవత్సరాల వయస్సు గల యువతీయువకుల కోసం ప్రత్యేకంగా ‘చాట్ జీపీటీ ఫర్ టీన్స్’ (ChatGPT for Teens) పేరిట ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడటం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, టీనేజర్లు ఏఐ చాట్‌బాట్‌ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించేలా ఈ నూతన వెర్షన్లో పలు కఠిన భద్రతా నిబంధనలు, ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. యూజర్లు తమ వయస్సును 13-17 సంవత్సరాల మధ్యగా నమోదు చేసినా లేదా సిస్టమ్ ద్వారా గుర్తించినా, వారి అకౌంట్లు ఆటోమేటిక్‌గా ఈ కొత్త టీన్ వెర్షన్‌లోకి మారిపోతాయి.
స్టూడెంట్లకు చదువులో సహాయపడేందుకు:
ఈ కొత్త వెర్షన్లో స్టూడెంట్లకు చదువులో సహాయపడేందుకు ప్రత్యేకంగా ‘స్టడీ మోడ్’ (Study Mode) ను రూపొందించారు. ఇది హోంవర్క్ లేదా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇచ్చేయకుండా, స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా వారిలో సృజనాత్మకతను మరియు ఆలోచనా శక్తిని పెంపొందించేలా పనిచేస్తుంది. అలాగే టీనేజర్లు ఎక్కువ సేపు స్క్రీన్ ముందు గడపకుండా నిరోధించడానికి తరచుగా బ్రేక్ రిమైండర్లు వస్తాయి. రాత్రి సమయాల్లో లేదా చదువుకునే వేళల్లో చాట్‌బాట్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేసేందుకు ‘క్వైట్ అవర్స్’ ను సెట్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
అంతేకాకుండా, టీనేజర్ల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక మార్పులు చేశారు. చాట్‌బాట్ యూజర్లతో అతిగా రొమాంటిక్ లేదా వ్యక్తిగత భావోద్వేగాలను వ్యక్తపరచకుండా, మానవ సంబంధాలను అనుకరించకుండా కఠినమైన నిబంధనలు అమర్చారు. దీనితో పాటు వాయిస్ మోడ్ వంటి కొన్ని ఫీచర్లపై కూడా తగిన నియంత్రణలు ఉంచారు.
ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం పేరంటల్ కంట్రోల్స్ (Parental Controls) ను పరిచయం చేశారు. దీనిద్వారా పేరెంట్స్ తమ అకౌంట్‌ను టీనేజర్ల అకౌంట్‌తో లింక్ చేసుకుని, వారి యాక్టివిటీని పర్యవేక్షించడం మరియు క్వైట్ అవర్స్ వంటి సెట్టింగ్స్‌ను నిర్వహించడం సులభం అవుతుంది. టీనేజర్లలో మానసిక ఉల్లాసాన్ని కాపాడుతూ, వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లయింగ్ కారు రవికి కేంద్ర మంత్రి సపోర్ట్..!
- ఇరాన్ నుంచి యూఏఈ వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు..
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!
- చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- ఖతార్‌లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!







