కాప్సికం చట్నీ
- April 13, 2015
కావలసిన పదార్ధాలు:
- కాప్సికం - 2
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూను
- ఉప్పు - తగినంత
- ఎండు మిరపకాయలు - 5 (మీ టేస్ట్ కి సరిపడా)
- ఆయిల్ - 5 టేబుల్ స్పూన్లు
- చింతపండు - పెద్ద ఉసిరికాయ సైజు
- బెల్లం - 1 ఇంచ్ (ఆప్షనల్ )
చేయు విధానం:
- ముందుగా ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, చింతపండు వేసి కాస్త దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి.
- అదే బాండీలో మరో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాప్సికం ముక్కలను రంగు మారేదాకా వేయించాలి.
- ఇప్పుడు ఈ కాప్సికం ముక్కలను, ఉప్పు మరియు పైన వేయించి పెట్టుకున్న దినుసులను మిక్సీ లో చట్నీ పట్టుకోవాలి. (మిక్సీ లో తీపి ఇష్టపడేవారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు) అంతే కాప్సికం చట్నీ రెడీ.
- ఈ చట్నీ అన్నంతో అయినా రోటీతో అయినా బాగుంటుంది.
---- మోహన మాధురి మల్ల, దుబాయ్, యు ఏ యీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







