అధిక బరువు సమస్యలు దూరం చేసుకోండి
- April 14, 2015
మనిషి తన ఆరోగ్యం గురించి ఎన్నో రకాల జాగ్రత్తలు పడుతున్నా కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఆహార విషయంలో తేడాలు రావడం శరీరంలో మార్పులు రావడం జరుగుతుంటాయి. యవ్వనంలో ఈ సమస్యలు తలెత్తక పోయినా 35 సంవత్సరాల తర్వాత శరీరంలో మార్పులు రావడం సహజం. పొట్ట, నడుము భాగాలు పెరిగిపోవడం అధిక బరువు సమస్యలు తెలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందాంలంటే ఈ పద్దతులు పాటించండి..! మీరు మరీ బరువుగా ఉన్నారా ? పది మందిలో తిరగాలంటే కాస్త బిడియంగా ఉన్నరా అయితే ఏం ఫరువాలేదు మీరు బరువు తగ్గే తరుణోపాయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా తమలపాకులు మంచి ఔషదం గా పనిచేస్తుంది. అవునండీ ! తమలపాకుతో బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీర్ణక్రియను మెరుగుపరిచే తమలపాకును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చును. తమలపాకు బరువు నష్టం ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడతుంది. తమలపాకుతో వంటకాలు గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాల నుండి ఉదర పూతను రక్షిస్తుంది. అలాగే తమలపాకులు, మిరియాలను రోజువారీ డైట్లో చేర్చుకోవడం ఉత్తమం. తమలపాకు చాలా శక్తివంతమైన కడుపు ఉబ్బరం లక్షణాలను పూర్తిగా తొలగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. లేత మరియు ఆకుపచ్చగా ఉన్న తమలపాకులో 5 మిరియాల గింజలను వేసి, తమలపాకును మడిచి నమలాలి. మిరియాలు ప్రారంభంలో కొంచెం కారంగా ఉండవచ్చు. అలాగే ఆకును నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 8 వారాల పాటు తీసుకోవాలి. మిరియాలలో ఫ్యాతో న్యూట్రియంట్స్, పెప్పేరిన్ ఉండటం వల్ల కొవ్వు విచ్ఛిన్నంలో సహాయపడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







