కొత్త విద్యా సంవత్సరం వేళ.. సౌదీలో స్కూల్ సప్లై దుకాణాల్లో తనిఖీలు..!!
- August 22, 2026
రియాద్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరమైన నేపథ్యంలో సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పుస్తక దుకాణాలు, స్టేషనరీ షాపులపై విస్తృత తనిఖీలు చేపట్టింది. మంత్రిత్వ శాఖ అధికారులు మొత్తం 2,259 తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన పాఠశాల సామగ్రి అందుబాటులో ఉందా? ప్రత్యామ్నాయ ఉత్పత్తులు ఉన్నాయా? ధరలు స్థిరంగా ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించారు.
అలాగే దుకాణాల్లో విక్రయించే ఉత్పత్తులపై ధరల ట్యాగ్ లేదా ఎలక్ట్రానిక్ ధర సమాచారం తప్పనిసరిగా ఉందా అనే విషయాన్ని తనిఖీ చేశారు. వాణిజ్య డిస్కౌంట్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశంపైనా దృష్టి సారించారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంతో పాటు, వ్యాపార సంస్థలు వాణిజ్య మంత్రిత్వ శాఖ చట్టాలు, నిబంధనలను పాటించేలా చూడటమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్‌డౌన్..!!
- డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!
- అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్‌లు, పార్కులు మూసివేత..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్లో పర్యావరణ ఉల్లంఘనలపై అధికారుల చర్యలు..!!
- కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!
- కొత్త విద్యా సంవత్సరం వేళ.. సౌదీలో స్కూల్ సప్లై దుకాణాల్లో తనిఖీలు..!!
- భారత కాన్సుల్ జనరల్‌కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం
- సౌదీ తబూక్లో భారతీయులతో కాన్సుల్ జనరల్ భేటీ..
- రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త.. జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలి: అబుదాబి పోలీసుల హెచ్చరిక







