కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!

- August 22, 2026 , by Maagulf
కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!

కువైట్ సిటీ: డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులో కువైట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మాదక, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారుల ప్రకారం.. నిందితులు అక్రమంగా సంపాదించిన డబ్బును దాచిపెట్టి, దానితో బంగారం, ఖరీదైన వాచీల వంటి అధిక విలువైన ఆస్తులుగా మార్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఆపరేషన్‌లో  నిందితుల వద్ద నుంచి KD 40,000 నగదుతోపాటు సుమారు KD 50,000 విలువైన 4 ఖరీదైన వాచీలు, సుమారు 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వాచీలు, డ్రగ్స్ తదితర వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com