ధోఫార్ ఖరీఫ్ సీజన్‌లో పర్యావరణ ఉల్లంఘనలపై అధికారుల చర్యలు..!!

- August 22, 2026 , by Maagulf
ధోఫార్ ఖరీఫ్ సీజన్‌లో పర్యావరణ ఉల్లంఘనలపై అధికారుల చర్యలు..!!

మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ ఖరీఫ్ సీజన్ సందర్భంగా పర్యావరణ ఉల్లంఘనలను అరికట్టేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. పర్యావరణ పరిరక్షణ బృందం.. ధోఫార్ మున్సిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుండటంతో పచ్చని ప్రాంతాలు, సహజ వనరుల పరిరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ, ఉల్లంఘనలపై చర్యలను పెంచారు.

ఒమన్ పర్యావరణ ప్రాధికార సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 238 పర్యావరణ ఉల్లంఘనలు నమోదయ్యాయి. గ్రీనరీ ప్రాంతాల్లోకి వెళ్లిన 3,914 వాహనాలను తొలగించారు. 250 ప్రాంతాలను మూసివేశారు. చెత్త కంటైనర్లు నిండిపోవడంపై 156 ఫిర్యాదులు అందాయి. 89 వదిలివేయబడిన వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

ఖరీఫ్ సీజన్‌లో ధోఫార్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో పర్యాటక, బహిరంగ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయి. దీంతో సహజ ప్రాంతాలకు నష్టం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పచ్చని ప్రాంతాలను కాపాడటం, పర్యావరణానికి హాని కలిగించే చర్యలను నిరోధించడం, ధోఫార్ ఖరీఫ్ సీజన్‌ను పర్యావరణహితంగా, సుస్థిరంగా నిర్వహించడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com