అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్‌లు, పార్కులు మూసివేత..!!
- August 22, 2026
అబుదాబి: యూఏఈలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అబుదాబి, అల్ఐన్లోని పబ్లిక్ బీచ్‌లు, పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కార్యక్రమాలను కూడా నిలిపివేశారు. అబుదాబి సిటీ మున్సిపాలిటీ ప్రకారం.. భారీ వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ముందస్తు చర్యలు చేపట్టారు.
అల్ఐన్ మున్సిపాలిటీ కూడా వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పార్కులను తాత్కాలికంగా మూసివేసింది. అబుదాబి సివిల్ డిఫెన్స్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న వాడీలు, నీరు నిలిచే ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
వర్షాల కారణంగా కొన్ని రహదారులపై వేగ పరిమితులను కూడా తగ్గించారు. స్వీహాన్-నహల్, అల్ ఖజ్నా-రెమా, ఉమ్ అల్ ఓష్-అల్ రజీన్, అల్ ఫయా-అల్ ఖతీమ్ తదితర రహదారులపై వేగ పరిమితిని గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఇంటర్నేషనల్ రోడ్డులోని ఓ విభాగంలో వేగ పరిమితిని 100 కి.మీ.గా నిర్ణయించారు. వర్షం సమయంలో వాహనదారులు వేగ పరిమితులను పాటించాలని, ఇతర వాహనాలకు సురక్షిత దూరం పాటించాలని పోలీసులు సూచించారు. అలాగే వాడీలు, నీరు నిలిచిన ప్రాంతాల్లోకి వాహనాలతో వెళ్లవద్దని సూచించారు.
కాగా, శుక్రవారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మేఘావృత వాతావరణంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా కొంత తగ్గాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో క్యూములస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్‌డౌన్..!!
- డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!
- అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్‌లు, పార్కులు మూసివేత..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్లో పర్యావరణ ఉల్లంఘనలపై అధికారుల చర్యలు..!!
- కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!
- కొత్త విద్యా సంవత్సరం వేళ.. సౌదీలో స్కూల్ సప్లై దుకాణాల్లో తనిఖీలు..!!
- భారత కాన్సుల్ జనరల్‌కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం
- సౌదీ తబూక్లో భారతీయులతో కాన్సుల్ జనరల్ భేటీ..
- రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త.. జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలి: అబుదాబి పోలీసుల హెచ్చరిక







