లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్‌డౌన్..!!
- August 22, 2026
దోహా: ఫార్ములా-1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2026కు 100 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) 2026 రేస్‌కు సంబంధించిన ప్రత్యేక కీ విజువల్‌ను ఆవిష్కరించింది. నవంబర్ 27 నుంచి 29 వరకు జరిగే ఈ రేస్.. FIA ఫార్ములా-1 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పెనల్టిమేట్ రౌండ్‌గా జరగనుంది. 2026 సీజన్‌లో ఫార్ములా-1 భారీ సాంకేతిక మార్పులకు వేదిక కానుంది. కొత్త సాంకేతిక నిబంధనలతో కొత్త తరహా కార్లు బరిలోకి రానుండగా, ఆడి, క్యాడిలాక్ జట్లు కూడా గ్రిడ్‌లోకి ప్రవేశించనున్నాయి. మూడు రోజుల రేస్ వీకెండ్‌కు సంబంధించిన టికెట్లు వివిధ కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి.
* మెయిన్ గ్రాండ్‌స్టాండ్ – QAR 2,000
* నార్త్ గ్రాండ్‌స్టాండ్ – QAR 1,500
* టర్న్ 2, టర్న్ 3, టర్న్ 16 గ్రాండ్‌స్టాండ్లు – QAR 1,000
* లుసైల్ హిల్ జనరల్ అడ్మిషన్ – QAR 600
టికెట్‌తో ఫ్యాన్‌జోన్, ఫుడ్ కోర్ట్, రేస్ అనంతర సంగీత కార్యక్రమాలు, మెర్చండైజ్ అవుట్‌లెట్లు, ఉచిత షటిల్ సర్వీస్, ఉచిత పార్కింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్
విద్యార్థులకు ఎంపిక చేసిన కేటగిరీల్లో 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. చెల్లుబాటు అయ్యే విద్యార్థి గుర్తింపు కార్డు కలిగిన వారికి టర్న్ 3 టికెట్ QAR 800, జనరల్ అడ్మిషన్ టికెట్ QAR 480కు లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వర్తిస్తుంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టర్న్ 16 గ్రాండ్‌స్టాండ్ టికెట్‌పై 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ ధర QAR 750గా ఉంటుంది.
ఈ ఏడాది LIC ప్రీమియర్ హాస్పిటాలిటీ విభాగంలో Novikov Doha కొత్తగా చేరింది. మెయిన్ స్ట్రెయిట్ చివర్లో, టర్న్ 1కు ప్రత్యక్ష వీక్షణతో ఈ హాస్పిటాలిటీ అనుభవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పాన్ ఏషియన్, ఇటాలియన్ వంటకాలతో పాటు ఇండోర్ సీటింగ్, ఔట్‌డోర్ టెర్రస్, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రొఫెషనల్ డీజేలతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్‌డౌన్..!!
- డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!
- అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్‌లు, పార్కులు మూసివేత..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్‌లో పర్యావరణ ఉల్లంఘనలపై అధికారుల చర్యలు..!!
- కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!
- కొత్త విద్యా సంవత్సరం వేళ.. సౌదీలో స్కూల్ సప్లై దుకాణాల్లో తనిఖీలు..!!
- భారత కాన్సుల్ జనరల్‌కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం
- సౌదీ తబూక్లో భారతీయులతో కాన్సుల్ జనరల్ భేటీ..
- రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త.. జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలి: అబుదాబి పోలీసుల హెచ్చరిక







