సహారా గ్రూపుకు మరో పెద్ద ఎదురుదెబ్బ
- July 28, 2015
సహారా గ్రూపుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సహారా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్ ను సెబి రద్దుచేసింది.ఈ వ్యాపారం చేయడానికి ఇక అది ఏమాత్రం పనికిరాదని తేల్చేసి, దాని ఆపరేషన్లను మరో ఫండ్ హౌస్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. సహారా గ్రూపునకు చెందిన రెండు కంపెనీలు రూ. 24 వేల కోట్లు చెల్లించాలంటూ సెబి ఆదేశించిన తర్వాతి నుంచి సహారా గ్రూపునకు, సెబికి మధ్య చాలా కాలంగా రెగ్యులేటరీ, చట్టపరమైన వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవలే ఓ సహారా కంపెనీకి చెందిన పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ లైసెన్సును కూడా సెబి రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా సహారా మ్యూచువల్ ఫండ్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది.సహారా మ్యూచువల్ ఫండ్, సహారా ఎసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు ప్రస్తుత, కొత్త మదుపుదారుల నుంచి సబ్ స్క్రిప్షన్లు తీసుకోవడం వెంటనే ఆపేయాలని కూడా సెబి ఆదేశించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







