‘టాక్సిక్’ ఈవెంట్లో మల్లారెడ్డి స్పీచ్ వైరల్

- August 23, 2026 , by Maagulf
‘టాక్సిక్’ ఈవెంట్లో మల్లారెడ్డి స్పీచ్ వైరల్

హైదరాబాద్: హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన ‘టాక్సిక్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మాజీ మంత్రి, నటుడు మల్లారెడ్డి తనదైన వినోదాత్మక ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.వేదిక పైకి రాగానే ఎప్పటిలాగే తన మార్క్ జోష్‌తో అభిమానులను, విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా కన్నడ స్టార్ హీరో యష్‌ను కొనియాడుతూ, “ఇండియాలోనే నీలాంటి పవర్‌ఫుల్ హీరో లేడు” అని పొగడ్తలతో ముంచెత్తారు. “యష్ అన్న.. నీతో ఒక్క ఫొటో దిగాలి” అంటూ ఆయన్ను వేదికపైకి ఆహ్వానించి సభలో నవ్వులు పూయించారు. ‘

రూ.2100 కోట్ల మైలురాయి’: జోకులు, ప్రశంసలతో కిక్కిచ్చిన ఈవెంట్

ఇదే క్రమంలో సినిమా బాక్సాఫీస్ సాధించబోయే వసూళ్లపై ప్రొడ్యూసర్ తనతో అన్న మాటలను మల్లారెడ్డి సరదాగా పంచుకున్నారు. “ఈ సినిమా రూ. 2100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఖాయం.. ఆ తర్వాత నీకు పైసలే పైసలు” అని ప్రొడ్యూసర్ అన్నట్లు మల్లారెడ్డి చెప్పడంతో వేదికపై ఉన్న చిత్ర యూనిట్‌తో పాటు హాజరైన వేలాది మంది విద్యార్థులు కేరింతలు కొట్టారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి, యష్ వంటి పాన్-ఇండియా హీరో ఈవెంట్‌లో చేసిన ఈ సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com