పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- August 24, 2026
మనామా: వైద్యపరమైన తప్పిదం కారణంగా ఓ విదేశీ మహిళ మృతిచెందిన కేసులో ఇద్దరు డాక్టర్లకు కోర్టు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. ఆమెకు డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA) రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన 2022 మార్చి 6న చోటుచేసుకుంది. అనారోగ్యంతో ప్రయాణించలేని స్థితిలో ఉన్న మహిళను బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ అత్యవసర విభాగానికి తరలించారు.
పేషంట్ కు ఉన్న వైద్య సమస్యను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేయించడంలో, అలాగే తదుపరి పరీక్షలు మరియు చికిత్స కోసం ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి పంపించడంలో ఇద్దరు వైద్యులు విఫలమయ్యారని కోర్టు నిర్ధారించింది. వైద్య వృత్తికి సంబంధించిన నిబంధనలు, అవసరమైన వైద్య ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం చేసి పొరపాటున పేషంట్ మరణానికి కారణమయ్యారంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇద్దరు వైద్యులపై అభియోగాలు మోపింది.
మొదట దిగువ క్రిమినల్ కోర్టు ఇద్దరికీ ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే BD100 బెయిల్‌పై శిక్ష అమలును నిలిపివేసింది. తరువాత హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ శిక్షను ఆరు నెలలకు తగ్గించింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ కాసేషన్ కూడా సమర్థించింది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







