జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- August 24, 2026
రియాద్: జెడ్డాలో భూ వివాదాలను పరిష్కరించే చర్యల్లో భాగంగా 1,480 మంది సౌదీ పౌరులకు ప్రత్యామ్నాయ భూముల పట్టాలను మక్కా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అందజేశారు. అల్-మలీసా టౌన్షిప్లో నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు జెడ్డా మున్సిపాలిటీ ఈ చర్యలు చేపట్టింది. మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలెద్ అల్-ఫైసల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జెడ్డాకు ఈశాన్య దిశలో ఉన్న తైబా డెవలప్మెంట్ టౌన్షిప్లో లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారు. తైబా డెవలప్మెంట్లోని 612/J/S నంబర్ కింద ఉన్న స్థలాలను ఎలక్ట్రానిక్ లాటరీ విధానం ద్వారా కేటాయించారు. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా స్థలాల కేటాయింపులో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారులు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి తమ భూమి పట్టాలను పొందేలా ఏర్పాట్లు చేశారు.
జెడ్డా మున్సిపాలిటీ, న్యాయ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత ఇతర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో భూ వివాదాలను పరిష్కరించి, లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను బదలాయించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది. ఈ ప్రక్రియ పూర్తికావడం ద్వారా పౌరుల సమస్యలను పరిష్కరించడంలో సౌదీ నాయకత్వం చూపుతున్న నిబద్ధత మరోసారి స్పష్టమైందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







