షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- August 28, 2026
షార్జా: యూఏఈలోని షార్జాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఏడేళ్ల బాలిక సఫా ముబారక్ భవనం మూడో అంతస్తు కిటికీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సఫాను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన సమయంలో బాలిక తల్లి ముర్షిదా పనిలో ఉండగా.. తండ్రి ముబారక్ కారు పార్కింగ్ నుంచి తరలించేందుకు కొద్దిసేపు బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సఫా మృతదేహాన్ని షార్జా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించగా.. బంధువులు, స్నేహితులు, కుటుంబానికి పరిచయం ఉన్న పలువురు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. అవసరమైన అధికారిక ప్రక్రియలు, ఇస్లామిక్ సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.
కుటుంబ సభ్యుల ప్రకారం.. సఫా ఇటీవలే భారత్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై కుటుంబంతో కలిసి షార్జాకు తిరిగి వచ్చింది. ఆమె ఎంతో చురుకైన, తెలివైన, అందరితో కలివిడిగా మాట్లాడే చిన్నారి అని బంధువులు గుర్తుచేసుకున్నారు. సఫా మృతదేహాన్ని గురువారం రాత్రి భారత్‌కు తరలించి, కేరళలోని స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







