మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- August 28, 2026
మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో పర్యాటకులను ఆకర్షిస్తున్న ‘మరాఫీ అల్ లుబాన్’ హెరిటేజ్ మార్కెట్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఖరీఫ్ సీజన్లో మిర్బాత్ ప్రాంతంలో పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 10న అఘ్బీర్ పార్క్‌లో ప్రారంభమైన ఈ మార్కెట్ ఇప్పటికే ముగియాల్సి ఉండగా.. సందర్శకుల నుంచి మంచి స్పందన రావడంతో మరో ఏడు రోజులు పొడిగించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ధోఫార్‌లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు విశేష స్పందన లభిస్తోంది. జూన్ 21 నుంచి జూలై 31 మధ్య 4,72,449 మంది పర్యాటకులు ధోఫార్ను సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 4,42,100 మందితో పోలిస్తే ఇది 6.9 శాతం అధికం. వీరిలో 76.3 శాతం మంది ఒమానీలు కాగా.. 16.6 శాతం మంది గల్ఫ్ దేశాల (GCC) పౌరులు ఉన్నారు.
‘మరాఫీ అల్ లుబాన్’ను స్థానికంగా ‘సుగంధ ద్రవ్యాలు (ఫ్రాంకిన్సెన్స్) ’ అనే అర్థంలో పిలుస్తారు. మిర్బాత్ పాత మార్కెట్ వాతావరణాన్ని పునఃసృష్టిస్తూ.. పట్టణ, సముద్ర, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, స్థానిక కళాకారులు, ఉత్పత్తిదారుల కోసం స్టాళ్లు ఇందులో ఉన్నాయి. చారిత్రకంగా మిర్బాత్ గుర్రాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. తరువాతి కాలంలో చేపల వేట, అబలోన్ వాణిజ్యం కూడా స్థానిక ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారాయి. మిగిలిన ఖరీఫ్ సీజన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు అదనపు వారంలో కుటుంబ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.
మిర్బాత్లో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 3.5 మిలియన్ ఒమానీ రియాల్స్‌కు పైగా విలువైన పర్యాటక ప్రాంతాలు, రహదారులు, ప్రజా మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టినట్లు ధోఫార్ మున్సిపాలిటీ తెలిపింది. అఘ్బీర్ బీచ్ అభివృద్ధి ప్రాజెక్టు విలువ RO932,000 కు పైగా ఉంది. అదేవిధంగా మిర్బాత్ కోట, చారిత్రక మార్కెట్, కస్టమ్స్ భవనాల నిర్వహణ, అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపట్టారు. వారసత్వ ప్రదేశాలను పర్యాటక రంగంతో అనుసంధానిస్తూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు పెట్టుబడి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







