అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- August 28, 2026
దోహా: అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తుల తయారీ, దిగుమతి, విక్రయాలు, వినియోగం, ప్రిస్క్రిప్షన్, ప్రకటనలు, ప్రచారంపై ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. BPC-157, Retatrutide, MOTS-c తదితర అనుమతి లేని పెప్టైడ్‌ల ప్రచారం, పంపిణీ, వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇంజెక్షన్లతో పాటు వివిధ మెడిసిన్ రూపాల్లో ఈ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. చికిత్స, సౌందర్య ప్రయోజనాలు, శారీరక సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రచారం చేస్తున్నప్పటికీ.. మానవ వినియోగానికి ఖతార్‌లోని సంబంధిత నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొన్ని పెప్టైడ్ ఉత్పత్తులు ఇంకా పరిశోధన లేదా క్లినికల్ అధ్యయనాల దశలోనే ఉన్నాయని, మరికొన్నింటికి మార్కెటింగ్ అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు.
అనుమతి లేని ఏ పెప్టైడ్ ఉత్పత్తినైనా దిగుమతి చేయడం, తయారు చేయడం, విక్రయించడం, సూచించడం, పంపిణీ చేయడం, ఇంజెక్ట్ చేయడం, వినియోగించడం, ప్రకటన చేయడం లేదా ప్రచారం చేయడం పూర్తిగా నిషేధించినట్లు శాఖ తెలిపింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేయడం కూడా నిషేధ పరిధిలోకి వస్తుందని పేర్కొంది.
పరిశోధన కోసం మాత్రమే, మానవ వినియోగానికి కాదు వంటి లేబుళ్లతో విక్రయించే ఉత్పత్తులను మానవ వినియోగానికి ఉపయోగించినా లేదా ప్రచారం చేసినా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం హెచ్చరించింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







