కాష్మోరా అవతారంలో కార్తీ
- August 18, 2016
ఒక్కసారిగా చూస్తే పక్కన వున్న చిత్రంలోని వ్యక్తి బాహుబలిలో కట్టప్ప అని పొరపాటు పడే అవకాశముంది. ఎంత పరికించి చూసినా ఆ స్టిల్‌లో యుద్ధప్రభువు గెటప్‌లో వున్నది తమిళ నటుడు కార్తీ అని గుర్తుపట్టడం కష్టమే. ఇటీవల విడుదల చేసిన కాష్మోరా చిత్రంలో కార్తీ శత్రుభయంకరమైన వినూత్న అవతారం ఇప్పుడు దక్షిణాదిలో అందరినీ ఆకట్టుకుంటోంది.
కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పతాకాలపై పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్. ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. గోకుల్ దర్శకుడు. సూపర్ నేచురల్ హిస్టారికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ విలక్షణ ఆహార్యంతో కూడిన కార్తీ గెటప్ గురించి దాదాపు 7 నెలల శ్రమించాం. 47 గెటప్స్‌ను పరిశీలించి అందులో విభిన్నంగా అనిపించిన దానిని ఖరారు చేశాం. ఈ సినిమాలో హారర్ అంశాలతో పాటు చారిత్రక నేపథ్యం కూడా వుంటుంది. ఒక ఎపిసోడ్లో కార్తీ రాజ్ నాయక్ అనే సైన్యాధిపతిగా, నయనతార రతిన మహాదేవి పాత్రల్లో కనిపిస్తారు.
ఓ ఊహాజనిత సామ్రాజ్యంలో వారి పాత్రలు అత్యంత శక్తివంతగా సాగుతాయి. యుద్ధవీరుడిగా కార్తీ పాత్ర ఆద్యంతం రొమాంచితంగా వుంటుంది అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







