విడుదలకి సిద్దమవుతున్న 'వర్మ వర్సెస్ శర్మ'
- August 18, 2016
బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించిన చిత్రం 'వర్మ వర్సెస్ శర్మ'. బి.భువన విజరు దర్శకత్వంలో కామెడీ సెటైర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు బి.భువన విజరు మాట్లాడుతూ... వర్మ, శర్మ పాత్రల మధ్య టైటిల్‌కు తగ్గట్లే సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య టివిలో వచ్చే డిబేట్స్ అందరినీ నవ్విస్తాయి. చక్కని మెలోడీ పాటలకు తగ్గ లొకేషన్స్ కూడా కుదిరాయి. ప్రస్తుత ట్రెండ్‌కు, కమర్షియాలిటీకి ఏమాత్రం తగ్గకుండా కథనం కొనసాగుతుందని'' అన్నారు. నిర్మాత ఫణి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ...
గతంలో బి.భువన్ విజరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి తనకు ఈ అవకాశం ఇచ్చానని, దర్శకుడు ఫీల్ గుడ్, హ్యూమర్‌తో కూడిన చక్కని కథను రూపొందించాడని'' అన్నారు. ''చిత్ర పరిశ్రమకు తాను క్రొత్త అయినప్పటికీ, ట్రెండ్‌కి తగ్గట్లు పూర్తి స్థాయి హాస్య భరిత చిత్రాన్ని నిర్మించినందుకు సంతోషంగా ఉందని'' అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. సెప్టెంబర్ ద్వితీయార్ధంలో ఆడియో విడుదల చేసి తదుపరి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని'' తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







