బహ్రెయిన్‌లో ఇరాన్‌ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!

- August 29, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ఇరాన్‌ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!

మనామా: అధికారిక పత్రాలను నకిలీ చేసి, తప్పుడు గుర్తింపుతో బహ్రెయిన్‌ పౌరులకు మాత్రమే అందే ప్రయోజనాలు పొందిన 72 ఏళ్ల ఇరాన్‌ పౌరుడికి బహ్రెయిన్‌లోని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం అతడిని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

కోర్టు వివరాల ప్రకారం.. నిందితుడు 1979లో ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వచ్చాడు. అనంతరం 1983లో నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సృష్టించి తన పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను మార్చుకున్నాడు. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి వర్క్ పర్మిట్, రెండు డ్రైవింగ్ లైసెన్సులు, గుర్తింపు పత్రాలు సహా పలు అధికారిక డాక్యుమెంట్లు పొందాడు.

అంతేకాకుండా సుమారు 31 ఏళ్లపాటు బహ్రెయిన్‌ పౌరుడిగా బీమా వ్యవస్థలో నమోదై ఉన్నాడు. దీని ద్వారా 2015 నుంచి రిటైర్‌మెంట్ పెన్షన్‌తో పాటు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను పొందాడు.కోర్టు విచారణ సందర్భంగా నిందితుడు తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించాడు. కేసును పరిశీలించిన న్యాయస్థానం అతడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు శిక్ష అనంతరం శాశ్వత దేశ బహిష్కరణను విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com