ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!

- August 29, 2026 , by Maagulf
ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!

సమాయిల్‌: ఒమన్‌లోని సమాయిల్‌ విలాయత్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.  వాడీ బనీ రావహా ప్రాంతంలోని సుల్తాన్‌ తువైని బిన్‌ సయీద్‌ రోడ్డుపై, మస్కట్‌ వైపు వెళ్తున్న మార్గంలో ట్రక్కు, పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, సమాచారం అందుకున్న రెస్యూ టీమ్  సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com