అబుదాబీ బాలిక ట్వీట్‌కి స్పందించిన సుష్మా స్వరాజ్
- August 18, 2016
భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ట్విట్టర్ ద్వారా అబుదాబీకి చెందిన ఓ బాలిక చేసిన రిక్వెస్ట్‌పై స్పందించారు. తన తండ్రి, ఓ కుట్ర కేసులో ఇరుక్కున్నారనీ, ఆ కేసుతో తన తండ్రికి సంబంధం లేదనీ, తమ కుటుంబాన్ని ఆదుకోవాలనీ అంజలి మోహన్ అనే 16 ఏళ్ళ బాలిక సుష్మా స్వరాజ్‌ని ట్విట్టర్లో కోరారు. వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్, ఈ విషయాన్ని రాయబారి దృష్టికి తీసుకెళ్తామనీ, అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విదేశాల్లోని భారతీయులు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే వెంటనే స్పందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు సుష్మా స్వరాజ్. సోషల్ మీడియా ద్వారా ఎందరో సమస్యల్లో చిక్కుకున్నవారి గురించి తెలుస్తోందనీ, ఇది ఓ మంచి ప్లాట్‌ఫామ్ అని ఆమె అన్నారు. సమస్యల్లో ఉన్నవారెవరైనా సోషల్ మీడియా ద్వారా తమ సమస్యల్ని చెప్పగలిగితే వీలైనంతవరకు వారికి సహాయపడేందుకు తాము ముందుంటామని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







