వోడాఫోన్ వారి బంపర్ ఆఫర్
- August 18, 2016
టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పోస్టుపెయిడ్ కస్టమర్లకు అపరిమిత రోమింగ్, అపరిమిత వాయిస్ కాలింగ్, 8 జీబీ డేటా ను అందించనున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలంటే నెలకు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఈ ప్లాన్ కింద రూ.1,699లకు ఉచిత రోమింగ్(ఇన్ కమింగ్ కాల్స్ కు మాత్రమే), అపరిమిత వాయిస్ కాలింగ్, 6జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది.
రోమింగ్ కాల్స్ , డేటా వాడకం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి పోస్ట్పెయిడ్ కస్టమర్ల ముందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు వొడాఫోన్ డైరెక్టర్(కమర్షియల్) సందీప్ కటారియా వివరించారు.
కొత్త వొడాఫోన్ ఆర్ఈడీతో, ఆల్-ఇన్-వన్ ప్లాన్ ను ఆఫర్ చేస్తూ తమ పోస్టుపెయిడ్ కస్టమర్ల రోమింగ్, డేటా, వాయిస్ కాలింగ్ అవసరాలను గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. మరింత ఎక్కువ మంది కస్టమర్ల అనుభూతిని పొందడానికి గాను 499 రూపాయలు, 699 రూపాయలు, 999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా తెచ్చినట్టు కటారియా తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







